Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలసరి ఎమోజీ అలా వద్దు.. ఇలా మార్చండి.. అంటున్న మహిళలు

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (19:15 IST)
స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాను వినియోగించే వారికి ఎమోజీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోజీలను సందేశాల్లో పోస్టు చేయడం.. తద్వారా తమ అభిప్రాయాలను తెలియజేసేవారు కోకొల్లలు.


ఇలాంటి ఎమోజీలను లక్షలాది మంది వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమోజీలకు అనుమతులిచ్చే.. యూనికోడ్ కాన్సోర్టియమ్ అనే సంస్థ ప్రస్తుతం 230 కొత్త ఎమోజీలకు అనుమతులు ఇచ్చింది. 
 
వీటిలో ముఖ్యంగా ఒక ఎమోజీ నెలసరికి సంబంధించింది. తాజాగా యూనికోడ్ అనుమతి ఇచ్చిన రక్తపు చుక్కలా కనిపించే ఎమోజీపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెలసరిని తెలియజేసేందుకు కలిగే ఇబ్బందిని ఈ ఎమోజీ ద్వారా తొలగించవచ్చునని యూనికోట్ వెల్లడించింది.
 
అయినప్పటికీ రక్తపు బిందువులా వున్న ఈ ఎమోజీని బట్టి పెద్దగా అవగాహన ఏర్పడదని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే నెలసరికి సంబంధించి ఇంకా కొన్ని స్పష్టమైన ఎమోజీలకు అనుమతులు ఇవ్వాలని మహిళలు సదరు సంస్థను కోరారు. ఇందుకు సంబంధించి కొన్ని ఎమోజీలను కూడా ఆ సంస్థకు సిఫార్సు చేశారు. ఈ ఎమోజీలకు త్వరలో అంగీకారం లభిస్తుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments