Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది భారత్‌లో అంతర్భాగమే.. కానీ భారతీయ పురుషులకు నో ఎంట్రీ.. ఎందుకని?

అదో మినీ ఇజ్రాయేల్. కానీ, భారత్‌లో అంతర్భాగం. భారతదేశంలో ఉన్న సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో అదొకటి. ఈ ప్రాంత ప్రకృతి అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:59 IST)
అదో మినీ ఇజ్రాయేల్. కానీ, భారత్‌లో అంతర్భాగం. భారతదేశంలో ఉన్న సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో అదొకటి. ఈ ప్రాంత ప్రకృతి అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా ఇజ్రాయేల్‌ పర్యాటకులు అమితంగా ఇష్టపడుతారు. కానీ, ఈ ప్రాంతంలోని పర్యాటక అందాలను కనులారా వీక్షించేందుకు మాత్రం భారతీయ పురుషులకు మాత్రం అనుమతి లేదు. ఆ ప్రాంతం పేరు కసోల్. ఓ చిన్నపాటి గ్రామం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రాంతం రమణీయమైన ప్రకృతి అందాలతో నిండివుంటుంది.
 
ఈ గ్రామంలో హిబ్రూ భాష మాట్లాడతారు. భారతీయ పురుషులను రానివ్వరు. ఒకవేళ ఎవరైనా మగాడు వెళ్ళినా స్థానికులు ఆశ్రయం ఇవ్వరు. పురుషులపై ఈ గ్రామం పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాకుండా ఇక్కడ ప్రకృతి సౌందర్యం, పరిసరాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి. తరతరాల నుంచి ఇజ్రాయిలీలు ఇక్కడికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు.
 
భారతీయ పురుషుల రాకపై నిషేధం విధించడానికి కారణం లేకపోలేదు. ఈ గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చే విదేశీ మహిళలను ఈవ్ టీజింగ్ చేస్తుండటమేనని స్థానికులు వివరించారు. అంటే కసోల్‌లో పుట్టిన మగాళ్ళే ఆ అందాలను ఆస్వాదించగలరన్నమాట! విదేశీ పర్యాటకులకు బస ఏర్పాటు చేయడానికి రోజుకు రూ.300 చొప్పున స్థానికులు వసూలు చేస్తారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments