Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలీఫ్లవర్ పంట కోసిందనీ.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కసాయి కొడుకు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (11:55 IST)
నవ మాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి పట్ల ఓ కసాయి కొడుకు కర్కశంగా నడుచుకున్నాడు. తన పంట పొలంలో కాలీఫ్లవర్ పంట కోయడమే ఆ తల్లి చేసిన నేరం. దీంతో కన్నతల్లిని స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చావబాదాడు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కియోంఝర్లోనిలోని సరపరి అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని సరపరి అనే గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరికీ పెళ్ళిళ్లు కావడంతో వేర్వేరుగా ఉంటూ పొలం పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 
 
అయితే, చిన్న కుమారుడు శతృఘ్న మహంత (39) తన పొలం కాలీఫ్లవర్ పంటను సాగుబడి చేశాడు. దీంతో కన్నతల్లి కూర వండుకునేందుకు ఓ కాలీఫ్లవర్ కోసింది. ఈ విషయం తెలుసుకున్న కొడుకు.. తన అనుమతి లేకుండా కాలీఫ్లవరు ఎందుకు తెంపావని దుర్భాషలాడుతూ తల్లిని నిలదీశాడు. అంతటితే ఆగకుండా ఆమె వీధిలో కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చావబాదాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మహంతను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments