Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో అన్ని వేరియంట్‌లను నిరోధించే ఒకే వ్యాక్సిన్‌

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:37 IST)
కరోనా మహమ్మారిని నిరోధించే సరికొత్త వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి  వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం ఉన్న కరోనా వేరియంట్‌లతో పాటు భవిష్యత్తులో రానున్న కొత్త తరం వైరస్‌ను కూడా నిలువరించ గలిగే సామర్థాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఈ వ్యాక్సిన్‌ ఒక్కో డోసు కేవలం రూ.75కే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసింది.

సాధారణంగా 'పోర్కైన్‌ ఎపిడమిక్‌ డయేరియా వైరస్‌ (పిఇడివి)' అనే వైరస్‌ పందుల్లో డయేరియా, తీవ్ర జ్వరం తదితర ఇబ్బందులను సృష్టిస్తుంది. ఇది కూడా కరోనా కుటుంబానికి చెందిన వైరసేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ పరిశోధనల్లో భాగంగా పిఇడివి, కరోనా నివారణ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌లు .. కరోనా జాతికి చెందిన అన్ని వైరస్‌లపై ఉండే 'ఫ్యుజన్‌ పెప్టైడ్‌'లను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి.

అయితే ఇవి ఇన్‌ఫెక్షన్‌ను నిలువరించకున్నా వైరస్‌పై పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని వేగంగా సన్నద్ధం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వైరస్‌  జన్యుక్రమంలో మార్పులతోనే  కొత్త వేరియంట్‌లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments