Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు పార్టీకి పిలవలేదని గొడవ.. ఫ్రెండ్‌ను చంపి తలను వేరు చేసిన స్నేహితులు

మద్యంమత్తులో నలుగురు యువకులు కలిసి తమ స్నేహితుడిని హత్య చేశారు. ఆ తర్వాత తల, మొండెంలను వేరు చేసి, తలను ఒకచోట, మొండెంను మరోచోట పూడ్చిపెట్టారు. ఈ దారుణం డిసెంబర్ 31వ తేదీ రాత్రి తమిళనాడు రాష్ట్రంలోని నా

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (10:49 IST)
మద్యంమత్తులో నలుగురు యువకులు కలిసి తమ స్నేహితుడిని హత్య చేశారు. ఆ తర్వాత తల, మొండెంలను వేరు చేసి, తలను ఒకచోట, మొండెంను మరోచోట పూడ్చిపెట్టారు. ఈ దారుణం డిసెంబర్ 31వ తేదీ రాత్రి తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లా కేంద్రంలోని భారతి మార్కెట్‌ ప్రాంతానికి చెందిన మ‌దియళగన్‌, సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్‌లు మంచి స్నేహితులు. వీరంతా కలిసి అప్పుడ‌ప్పుడు మందు పార్టీలు చేసుకునేవారు. ఈ క్రమంలో న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గత నెల 31న రాత్రి స్థానిక‌ శ్మశానవాటిక ప్రాంతంలో సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ మందు పార్టీ చేసుకున్నారు. 
 
ఈవిషయం మదియళగన్‌ చెప్పలేదు. కానీ, ఈ విషయం తెలుసుకున్న మది.. పార్టీ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వారిని నిల‌దీశాడు. దీంతో చెల‌రేగిన గొడ‌వ‌లో మ‌దియళగన్‌ బీర్‌ బాటిల్‌ తీసుకుని ఓ స్నేహితుడిని పొడవ‌డానికి య‌త్నించాడు. అప్పటికే పీకలవరకు మద్యం సేవించివున్న మిగిలిన స్నేహితులంతా క‌లిసి మదియళగన్‌ను కత్తితో పొడిచి చంపేశారు. 
 
అంతేకాదు... మదియళగన్‌ తలను శరీరం నుంచి వేరు చేశారు. అనంత‌రం తలని, మొండాన్ని ఓ కాలువ పక్కన గుంత తవ్వి పాతిపెట్టారు. త‌మ కుమారుడు క‌న‌ప‌డ‌కపోవ‌డంతో అత‌డి త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు మదియళగన్ స్నేహితులే అత‌డిని చంపేశార‌ని గుర్తించారు. ముదియ‌ళ‌గ‌న్ స్నేహితులు నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు మాత్రం ప‌రారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments