Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ : ఆమె చైనా రాయబారి కాదట!

Webdunia
బుధవారం, 4 మే 2022 (16:06 IST)
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేపాల్ దేశానికి ఓ వివాహానికి వెళ్లారు. అక్కడ ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కార్యక్రానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ మహిళతో కనిపించారు. అంతే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిది. 
 
బీజేపీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి నైట్ క్లబ్‌లో రాహుల్ అని, భారతదేశ సమగ్రతను ప్రశ్నించేవారితో విందులా అంటూ ప్రశ్నలు సంధించారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఒక అడుగు ముందుకేసి చైనా హనీ ట్రాప్ అంటూ ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో జాతీయ మీడియా ఫ్యాక్ట్ చెక్ చేపట్టింది. ఇందులో రాహుల్ పక్కన ఉన్న మహిళ చైనా రాయబారి కాదని స్పష్టం చేసింది. రాహుల్ పక్కన చేతిలో గ్లాసుతో కనిపిస్తున్న మహిళ సీఎన్ఎన్ మాజీ జర్నలిస్టు సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని, ఆమె నేపాల్ జాతీయురాలని సదరు మీడియా సంస్థ ప్రకటించింది. పైగా, ఈ విషయాన్ని కూడా నైట్ క్లబ్ యజమాని కూడా అధికారింగా వెల్లడించారు. తమ క్లబ్‌కు రాహుల్ గాంధీతో పాటు ఐదారుగురు మహిళలు వచ్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం