Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాషియర్‌కు సెల్యూట్ చెప్పారు.. క్షమాపణలు చెప్పారు.. సోషల్ మీడియా యూజర్లకు ఇది తగునా?

సోషల్ మీడియాలో ఓ బ్యాంక్ క్యాషియర్‌ అతి నెమ్మదిగా నోట్లు లెక్కపెడుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 14 మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. రెండు లక్షల మందికి పైగా షేర్ చేశారు. ఆమె అతి న

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (12:35 IST)
సోషల్ మీడియాలో ఓ బ్యాంక్ క్యాషియర్‌ అతి నెమ్మదిగా నోట్లు లెక్కపెడుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 14 మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. రెండు లక్షల మందికి పైగా షేర్ చేశారు. ఆమె అతి నెమ్మదిగా క్యాష్ కౌంటింగ్ చేయడం సెటైర్లు వేశారు. అంతేగాకుండా ఫాస్టెస్ట్ క్యాషియర్ అంటూ పేరు పెట్టారు. ఎంతోమంది చూసి సెటైరికల్ కామెంట్స్ చేశారు కానీ ఆమె అలా ప్రవర్తించేందుకు కారణముందని తెలిస్తే.. అందరూ తలదించుకోక తప్పదు. 
 
అసలు సంగతిని సామాజిక కార్యకర్త కుందన్ శ్రీనివాస్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. అది చదివిన తర్వాత కామెంట్స్ చేసినవారిలో చాలామంది ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ అసలు విషయమేంటంటే, ఆమె పేరు ప్రేమలత. పూణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. పెరాలసిస్ వల్ల ఆమె అచేతన స్థితిలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కోలుకున్న ఆమె తిరిగి విధుల్లో చేరింది. ఆ తర్వాత విధుల్లో చేరిన ఆమె నోట్లు లెక్కపెడుతుండగా తీసిన వీడియో అది. ఆమెకు చాలా సెలవులు కూడా ఉన్నాయి. బ్యాంకుకు రావాల్సిన పని కూడా లేదు.
 
కానీ అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అంకిత భావంతో ఆమె విధులకు హాజరైంది. 2017 ఫిబ్రవరిలో ఆమె రిటైర్ కానున్నారు. ప్రేమలత భర్త లేరు. కొడుకు అబ్రాడ్‌లో ఉంటున్నాడు. ఆమెకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా పని పట్ల నిబద్ధతతో ఆమె ఆఫీస్‌కు హాజరవుతోంది. ఇదీ ప్రేమలత కథ. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ : శ్రీతేజ్‌‍ను పరామర్శించిన పుష్పరాజ్! (Video)

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments