Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ పకోడి కొసరు కోసం కొట్టుకున్నారు.. యువకుడి మృతి.. రాయల్ చికెన్ సెంటర్‌లో?

నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా చికెన్‌ పకోడి కొనుగోలు విషయంలో ఏర్పడిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. నందికొట్క

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (12:08 IST)
నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా చికెన్‌ పకోడి కొనుగోలు విషయంలో ఏర్పడిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులోని రాయల్‌ చికెన్‌ సెంటర్‌లో అదే ప్రాంతానికి చెందిన చంద్రమోహన్‌(30) శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చికెన్‌ పకోడి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. 
 
కొసరు విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చికెన్ సెంటర్ ఓనర్ అబూబకర్, డైమాండ్ వలి, రియాజ్, వంట మాస్టర్ కలిసి అతడిపై దాడి చేశారు. దీంతో చంద్రమోహన్‌ ఇంటికి వెళ్లి జరిగిన విషయం బంధువులకు చెప్పడంతో వారు చికెన్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. 
 
మళ్లీ ఘర్షణ చోటుచేసుకోవడంతో చంద్రమోహన్‌కు తీవ్రగాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments