Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కగానొక్క కుమార్తె, ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపేసింది

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (09:25 IST)
ఒకే కుమార్తె. కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆమే ప్రాణమనుకున్నారు. మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. చదువు పూర్తయ్యింది. ఇంట్లో ఖాళీగా ఉంది. కానీ లాక్‌డౌన్ సమయం కావడంతో ఒక యువకుడితో  పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త తల్లిదండ్రులను చంపే స్థితికి చేర్చింది.
 
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో నివాసముండే జ్యోతి ప్రసాద్, నీలిమల ఒక్కనానొక్క కుమార్తె మానస. డిగ్రీ పూర్తి చేసింది. బాగా ఆస్తిపరురాలు. జ్యోతి ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. బాగా సంపాదించాడు. కుమార్తె అంటే ఆయనకు ప్రాణం.
 
తల్లికి కూడా కూతురు అంటే ఎంతో ఇష్టం. పెళ్ళి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కరోనా కావడంతో ఇంట్లోనే ఉంటున్న మానస ప్రశాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పరచుకుంది. ప్రశాంత్ తన స్నేహితురాలికి అన్న. 
 
స్నేహితురాలి ద్వారా పరిచయమైన ప్రశాంత్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఆ పరిచయం కాస్త చివరకు ఇద్దరి మధ్యా సాన్నిహిత్యాన్ని పెంచింది. ప్రశాంత్ కూడా మానస ఉన్న ప్రాంతంలోకి అతి దగ్గరగా ఉండేవాడు.
 
ఇలా ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. ప్రశాంత్‌తో మానస ఇంట్లోనే ఎంజాయ్ చేసేది. ఇరుగుపొరుగు వారికి విషయం తెలిసి మానస తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళారు. అయినా వారు నమ్మలేదు. 
 
ఎక్కువ రోజులు ఏ విషయాన్ని దాచలేరు కదా.. ప్రశాంత్‌తో మానస ఏకాంతంగా ఉన్న సమయంలో కళ్లారా చూసేశారు తల్లిదండ్రులు. కుమార్తెను బుజ్జగించారు. చేసే పని తప్పు అని చెప్పారు. అయితే తల్లిదండ్రుల కన్నా ప్రియుడే ఎక్కువ అనుకుంది మానస. అతనితో కలిసి తల్లిదండ్రుల హత్యకు ప్లాన్ చేసింది.
 
మూడురోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులను ప్రశాంత్‌తో కలిసి ఊపిరాడకుండా చంపేశారు. ఇద్దరూ కలిసి పారిపోయారు. కుమార్తెపైనే అనుమానం వచ్చిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య అని తేలడంతో నిందితుల కోసం గాలించి నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments