Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతికి సెలైన్... నోటికి ఆక్సిజన్... ఓ ధైర్యమైన గుండె ఆగిపోయింది..

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:04 IST)
ఢిల్లీకి చెందిన ఓ యువతి కోవిడ్ వైరస్ బారినపడినప్పటికీ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. చేతికి సెలైన్ పేపు, నోటికి ఆక్సిజన్ పైపుతో ఒకవైపు కోవిడ్ రోగులు.. మరోవైపు కోవిడ్ మృతుల మధ్య ఉంటూ కూడా ధైర్యంగా కరోనా చికిత్స చేయించుకుంది. అలాంటి ధీరవనిత గుండె ఆగింది. ఆమెకు కోవిడ్ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమెకు చికిత్స చేస్తూ వచ్చిన వైద్యురాలు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చేతికి సెలైన్ ఎంచుకుంటూ, నోటికి ఆక్సిజన్ పైపు తగిలించుకుని కోవిడ్ రోగుల మధ్య హాస్పిటల్‌లో చికిత్స పొందిన 30 యేళ్ళ యువతి... ఆస్పత్రి బెడ్ మీద భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాటలు వింటూ ఆనందంగా కనిపించింది. 
 
'లవ్ యూ జిందగీ' పాట వింటూ ఆమె ధైర్యంగా చికిత్స తీసుకుంటున్న వీడియోను ఢిల్లీకి చెందిన డాక్టర్ మోనిక గత వారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో ఎంత మందిలో స్ఫూర్తి నింపింది. 
 
అయితే ఆమె ధైర్యం కరోనా ముందు ఓడిపోయింది. పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో ఆమె గుండె ఆగిపోయింది. గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది. 'చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం' అంటూ మోనిక ఆమె మరణ వార్తను తెలియజేశారు. దీంతో ఎంతో మంది దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments