Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (15:42 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు దఫాలుగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. తొలి దఫా సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు, రెండో దఫా సమావేశాలు 15 రోజుల విరామం తర్వాత జరుగుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంపత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 
 
మరోవైపు, ఈ బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు సమాచారం. 31 నుంచి జరిగే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలోపే ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. సంక్రాంతి పండగ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. దీంతో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో ప్రాతినిధ్యం కల్పిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ నుంచి బీసీ నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments