Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు షాక్ - స్వయంగా కోర్టుకు రావాల్సిందే..

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (15:24 IST)
కోడికత్తి కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. కోడికత్తి శ్రీనివాస్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే, కోర్టు టేప్ రికార్డర్‌గా ఉండదని వ్యాఖ్యానించింది. 
 
ఈ కేసులో బాధితుడిని నేటి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది ప్రశ్నించారు. దీనికి సమాధానంగా స్టేట్మెంట్ రికార్డు చేశామని ఎన్.ఐ.ఏ న్యాయవాది చెప్పారు. రికార్డు చేస్తే చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని ప్రశ్నించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. 
 
ఈ కేసులో 56 మందిని విచారిస్తే 1 నుంచి 12 వరకు ఉన్నవారి స్టేట్మెంట్లు, చార్జిషీట్‌లో ఎందుకు లేవని ఎన్ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. కోర్టు బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్జి స్పష్టం చేశారు. అదేసమయంలో ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments