Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముస్లిం యువకులు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అలా కాపాడారు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (08:47 IST)
చుట్టూ విధ్వంసం.. పోలీసు కాల్పులు.. వేదనలు, రోదనలు.. మరోవర్గం తమపైకి వస్తుందేమోనన్న ఆందోళన. అంతటి విపత్కర పరిస్థితిలోనూ కొంతమంది ముస్లిం యువకులు మత సామరస్యాన్ని కాపాడేందుకు నడుం బిగించారు.

తమ ప్రాణాలొడ్డి ఆంజనేయ స్వామి ఆలయంపై విధ్వంసకారుల చేయిపడకుండా అడ్డుకున్నారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
 
బెంగళూర్‌లో ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బంధువు షేర్‌ చేసిన ఫేస్‌బుక్‌ పోస్టు విధ్వంసం సృష్టించింది. ఆ పోస్టు అవమానకరంగా ఉందంటూ పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపైకి దాడికి వచ్చారు. ఆ చట్టుపక్కల ఉన్న ఆస్తులపై ధ్వంసానికి తెగబడ్డారు. దాదాపు 200 బైకులను తగులబెట్టారు.

వీరిని ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘర్షణలో కొందరు ముస్లీమ్‌లు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు అల్లరి మూక ప్రయత్నించగా ముస్లీమ్‌ యువకులంతా కలిసి చేయి చేయి పట్టుకొని గుడిచుట్టూ మానవహారం చేపట్టారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందూముస్లీమ్‌లు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని సందేశాన్నిచ్చారని నెటిజన్లు వారిని కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments