నేను ప్రాణాలతో రాగలిగాను.. మీ సీఎంకు థ్యాంక్స్ : ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (20:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన పంజాబ్ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా నిలిచిపోయింది. భద్రతా వైఫల్యంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రధాని మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లకుండానే వెనక్కి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఇది కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పై దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. నిరసనకారులు ఆయన ప్రయాణిస్తున్న రోడ్డు మార్గాన్ని నిర్బంధించడంతో మోడీ ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతిపెద్ద భద్రతా లోపమని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆ తర్వాత ప్రధాని మోడీ ఆ ఫ్లైఓవర్ నుంచి భతిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంర్భంగా ఆయన ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడుతూ, "భతిండా ఎయిర్‌పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్" అని అన్నారు. మరోవైపు, ఈ ఘటన వల్ల ఫిరోజ్‌పూర్‌లో ఆయన చేపట్టాల్సిన ర్యాలీ రద్దు అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments