Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించాలి: పాక్ నటుడు పిలుపు

Advertiesment
2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించాలి: పాక్ నటుడు పిలుపు
, బుధవారం, 5 జనవరి 2022 (10:03 IST)
Javed Sheikh
2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో ఆ దేశ ప్రధానిని ఓడించాలని పాక్‌ నటుడు జావేద్‌ షేక్‌ పిలుపునిచ్చారు. మోదీ భారతదేశానికి మళ్లీ ప్రధానమంత్రి అయితే, పాకిస్తానీ సినీ తారలు భారతీయ సినిమాలో భాగం కాలేరని ఆరోపించారు జావేద్‌. 
 
భారత ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీ తప్పుకోవాలని పాకిస్తాన్ సినీ పరిశ్రమలోని వారు కోరుకుంటున్నారని చెప్పారు. జమ్ముకాశ్మీర్‌లో పుల్వామా దాడి జరిగిన తర్వాత పాక్‌ నటీనటులకు అవకాశాలు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు.
 
ఇకపోతే.. జావేద్ షేక్ ఓం శాంతి ఓం సహా పలు భారతీయ సినిమాల్లో నటించారు. ఓం శాంతి ఓం చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌కు తండ్రిగా నటించాడు. భారతీయ సినిమాలో భాగం కావడం సంతోషకరమైన విషయమన్నారు. అయితే ఇప్పుడు ఆ అవకాశాలు తగ్గిపోయాయని జావేద్ తెలిపారు. 
 
మోదీ ప్రధానిగా తప్పుకుంటేనే మరింత మంది పాకిస్తానీ నటులు భారతీయ సినిమాల్లో భాగం కాగలరన్నారు. అయితే ఈ మధ్య అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లో పాకిస్తానీ నటీనటులు నటించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సిమెంట్ ధరలు