Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని.. ఆమె భర్తను హత్య చేశాడు..

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (17:41 IST)
మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణం జరిగింది. తనతో పాటు కాలేజీలో చదివిన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు భావించాడు. కాలేజీ పూర్తయిన తర్వాత అది సాధ్యపడలేదు. కానీ, ఆమెపై తన వ్యామోహం కూడా తీరలేదు. దీంతో వివాహమైన తర్వాత కూడా ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆమె భర్తను హత్య చేశాడు. చివరకు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
పోలీసుల కథనం మేరకు ముంబై శాంతాక్రూజ్‌లోని గోలీబార్ నగర్‌కు చెందిన అకీల్ సయ్యద్, షాజహాన్ అనేవారు యుక్త వయసులో ఒకే కాలేజీలో చదువుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ షాజహాన్ వెంటపడేవాడు. ఒకవేళ తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కట్టుకున్న భర్తను చంపేస్తానని పలుమార్లు బెదిరించాడు. చివరకు అన్నంత పని చేశాడు. 
 
షాజహాన్‌కు ఆమె తల్లిదండ్రులు థానేలోని రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేసే పర్వేజ్ బషీర్ షేక్‌తో వివాహం చేశారు. అదే సమయంలో సయ్యద్‌కు కూడా వివాహమైంది. అయినప్పటికీ షాజహాన్‌పై ప్రేమను చంపుకోలేక పోయాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు కూడా చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికీ షాజహాన్‌ను వేధించడం వదిలిపెట్టలేదు. 
 
ఈ క్రమంలో మాట్లాడుకుందాం రమ్మని సయ్యద్‌ను పర్వేజ్ పిలిచాడు. వారిద్దరి మధ్య జరిగిన మాటలు పోట్లాటకు దారితీశాయి. అప్పటికే పర్వేజ్‌ను హత్య చేయాలన్న ఉద్దేశ్యంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో సయ్యద్ విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో పర్వేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. మృతుడు భార్య షాజహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వకోలా పోలీసులు హత్య కేసు నమోదు చేసి సయ్యద్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments