Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో శ్రీలంక తరహా పేలుళ్లకు లష్కరే-తోయిబా కుట్ర.. భద్రత కట్టుదిట్టం..

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (16:35 IST)
శ్రీలంకలో ఏప్రిల్‌లో తీవ్రవాదులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈస్టర్ పండుగ రోజున మూడు చర్చిలు, మూడు ఫైవ్ స్టార్ హోటళ్లు లక్ష్యంగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 359 మంది చనిపోయారు. 500 మంది గాయపడ్డారు. ఈ ఘటనను ఇంకా జనం మరిచిపోలేని పరిస్థితుల్లో వుండగా.. నిఘా సంస్థలు మరో హెచ్చరికను జారీ చేశాయి. 
 
శ్రీలంక పేలుళ్లకు సంబంధించి 106 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద జరిపిన విచారణలో అయోధ్యను లక్ష్యంగా దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన పార్టీకి చెందిన 18మంది ఎంపీలతో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేందుకు ఆదివారం వెళ్లనున్నారు. 
 
అలాగే యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ కూడా రామాలయంలో ఆదివారం పూజలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా రామ జన్మభూమి అధ్యక్షుడు మహానంద్ 81వ జయంతి ఉత్సవాలు కూడా జరుగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అయోధ్యలో ఉగ్రవాదులు దాడికి కుట్రపన్నినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 
 
అయోధ్యలో బస్సులు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలును లక్ష్యంగా లష్కరే తోయిబా సంస్థ దాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. దీంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులు, ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments