Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకున్న కొత్త జంట భద్రత కల్పించమని వెళితే..ఫైన్ వేసారు..ఎంతో తెలుసా?

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:42 IST)
సాధారణంగా పెళ్లి చేసుకున్న కొత్త జంట ముందుగా గుడికి లేదా మరొక ప్రాంతానికి వెళ్తారు. కానీ ఒక కొత్త జంట మాత్రం పెళ్లయిన వెంటనే కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లగానే రూ. 10,000 ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో ఓసారి చూద్దాం.
 
ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమించుకున్న ఓ జంట వివాహం చేసుకున్నారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకోవడంతో వారు దాడి చేస్తారనే భయంతో కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కొత్త జంట తాము పెళ్లాడిన ఫోటోలను కోర్టు వారికి సమర్పించారు. ఆ ఫోటోలను పరిశీలించిన కోర్టు, వారికి రూ. 10,000 ఫైన్ విధించింది. ఫైన్ ఎందుకు వేసారో తెలిస్తే మీరు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు.
 
కొత్త జంట పెళ్లి చేసుకునే సమయంలో ఎలాంటి మాస్క్‌లను ధరించలేదు. మాస్క్ లేకుండా బయటకు రాకూడదని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాయి. ఒకవేళ మాస్క్ ధరించకుండా అలాగే బయటకు వస్తే భారీగా ఫైన్ విధిస్తామని కూడా ప్రకటించాయి. ఈ కొత్త జంట పెళ్లి సందట్లో పడిపోయి మాస్క్ ధరించడం మరచిపోయారు. అందుకు ఆ జంటకు రూ. 10,000 ఫైన్ వేసారు. ఈ ఫైన్‌ను 15 రోజులలోపు చెల్లించాలని, అలాగే డిపాజిట్ చేసిన డబ్బును మాస్క్‌ల తయారీ కోసం వినియోగించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments