Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్.. తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు : టీడీపీ

'మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌! సభా వేదిక నుంచి డిమాండ్‌ చేస్తున్నా! విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి! సమగ్ర వివరణ ఇవ్వండి! లేదంటే... మీరు ఏపీ పట్ల దురుద్దేశంతో ఉ

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (09:09 IST)
'మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌! సభా వేదిక నుంచి డిమాండ్‌ చేస్తున్నా! విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి! సమగ్ర వివరణ ఇవ్వండి! లేదంటే... మీరు ఏపీ పట్ల దురుద్దేశంతో ఉన్నారని భావించక తప్పదు. మేం ఇంకా మీతో బంధం ఎందుకు కొనసాగించాలనే విషయంపై పునరాలోచించక తప్పదు' అంటూ లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నిలదీశారు. 
 
సుమారు 14 నిమిషాలపాటు ఆంగ్లంలో అనర్ఘళంగా చేసిన ప్రసంగంలో ప్రధాని, ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ, టీడీపీ కానీ మోసపోయే వారి జాబితాలో ఉండరు' అంటూ తేల్చి చెప్పారు. 
 
'రాష్ట్ర విభజన చట్టాన్ని ఆమోదించిన కాంగ్రెస్‌కు ఏపీ ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారు. మరి... ఆ చట్టంలోని అంశాలను కనీసం అమలు చేయని బీజేపీ సంగతి ఏమిటో ఆలోచించండి. వీటన్నింటిపై మీ వివరణ డిమాండ్‌ చేస్తున్నాం. లేనిపక్షంలో... మీరు మా రాష్ట్రం పట్ల 'దురుద్దేశం' (బ్యాడ్‌ ఫెయిత్‌)తో ఉన్నారని భావించి... ఈ బంధం ఎందుకు కొనసాగించాలి? అనే అంశంపై ఆలోచించక తప్పని పరిస్థితి వస్తుందని సభా ముఖంగా బీజేపీ అగ్రనేతలకు తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments