Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దడపుట్టిస్తున్న టీడీపీ ఎంపీలు.. వైకాపా ఎంపీల్లో కదలిక

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరగడంతో టీడీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు సభ లోపల, వెలుపల దడ పుటిస్తున్నారు. స్వయానా ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ

దడపుట్టిస్తున్న టీడీపీ ఎంపీలు.. వైకాపా ఎంపీల్లో కదలిక
, బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (10:52 IST)
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరగడంతో టీడీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు సభ లోపల, వెలుపల దడ పుటిస్తున్నారు. స్వయానా ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి చెందిన ఎంపీలే ఈ విధంగా ఆందోళనకు దిగడంతో బీజేపీ నేతల్లో కునుకులేకుండా పోయింది. 
 
దీంతో రాష్ట్రంలోని ప్రధాన విపక్ష పార్టీ అయిన వైకాపాకు చెందిన ఎంపీలు కూడా మేల్కొన్నారు. మంగళవారం నుంచి వారు సభలో ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్‌లు పార్లమెంట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ప్లకార్డులు చేతబట్టుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
 
మరోవైపు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను వైసీపీ ఎంపీలు బుధవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా విభజన హామీలను అమలుచేయాలని మంత్రిని ఎంపీలు కోరారు. అనంతరం ఎంపీలు విలేకరులతో మాట్లాడుతూ... విభజన హామీలపై హోంమంత్రి సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. 
 
ఏపీ ప్రజల కష్టాలను రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించామన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం, దుగ్గరాజపట్నం, కడప స్టీల్‌ ప్లాంట్ వంటి అంశాలను దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండి డ్రామాలాడుతోందని వారు ఆరోపించారు. తమ డిమాండ్లపై రాజ్‌నాథ్‌ సానుకూలంగా స్పందించారన్నారు. హామీల అమలుపై టీడీపీ కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లోపు విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సభ నుంచి బయటకు గెంటేసిన వెనక్కి తగ్గొద్దు : ఎంపీలకు చంద్రబాబు