Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నలుగురుపై అనర్హత వేటు వేయండి : టీడీపీ ఎంపీలు

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (19:43 IST)
తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ ఎంపీలైన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, సీతారామలక్ష్మిలు వినతిపత్రం సమర్పించారు. 
 
టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ (ఆంధ్రప్రదేశ్), గరికపాటి రామ్మోహన్ రావు (తెలంగాణ)లు గురువారం బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈ నలుగురు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో పార్టీ మారిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం చెల్లదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. విలీనం అంశాన్ని తప్పుబట్టిన వారు ....పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాము విలీనం కోరుతూ ఎలాంటి తీర‍్మానం చేయలేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరోవైపు, పార్టీ మారిన ఎంపీలు బీజేపీ సభ్యులే అంటూ రాజ్యసభ వెబ్‌సైట్‌లో అధికారికంగా పేర్కొనడం జరిగింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments