Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై టెక్కీపై అత్యాచారం.. హత్య : ముగ్గురికి జీవితశిక్ష ఖరారు

చెన్నై టెక్కీ మహేశ్వరిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవితకారాగారశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే..

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (09:39 IST)
చెన్నై టెక్కీ మహేశ్వరిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవితకారాగారశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
స్థానిక సిరుచ్చేరి సిప్‌కాట్‌ ప్రాంగణంలోని టీసీఎస్‌ సంస్థలో మహేశ్వరి (23) అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ వచ్చింది. ఈమె గత 2014 ఫిబ్రవరి 13వ తేదీన విధులకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి పోలీసులు.. వారం రోజుల తర్వాత సిప్కాట్‌ ప్రాంగణంలోని పొదల వద్ద గొంతు తెగిన స్థితిలో ఆమె శవంగా పడి ఉండగా కనుగొన్నారు. 
 
ఈ కేసును విచారించిన సీబీసీఐడీ పోలీసులు.. ఉమామహేశ్వరి ఏటిఎం సెంటర్‌లో డబ్బులు డ్రాచేసుకుని వెళుతున్న సమయంలో ఉత్తరాదికి చెందిన ముగ్గురు యువకులు వెంబడించి ఆమెను బలవంతంగా పొదలచాటుకు తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారం జరిపి, హతమార్చినట్టు తేల్చింది. ఈ కేుస విచారణ చెంగల్పట్టు కోర్టులో జరిగింది. 
 
నిందితులు ఉత్తమ్‌ మండల్‌ (23), రామ్‌మండల్‌ (23), ఉజ్జల్‌ మండల్‌ అనే ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ఆ ముగ్గురూ సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై న్యాయమూర్తులు నాగముత్తు, భారతిదాసన విచారణ జరిపారు. దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదునే హైకోర్టు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments