Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి బంగారం పెట్టలేదు.. పెళ్లైన మూడు నెలలకే..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:12 IST)
పెళ్లైన మూడు నెలలకే ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. దీపావళి పండుగకు బంగారం పెట్టలేదనే కోపంతో భర్త, అత్తమామలే ఆమెను హత్య చేసినట్లు యువతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా చిన్నకంచికి చెందిన నటరాజన్ కుమార్తె రూపవతి (29). ఈమెకు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన కృష్ణస్వామి కుమారుడు యువరాజ్‌తో సెప్టెంబర్ 12న కాంచీపురంలో వివాహం జరిగింది. యువరాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దీపావళికి యువరాజ్ దంపతులు కాంచీపురం వెళ్లారు. 
 
పెళ్లై తొలి దీపావళి కావడంతో పెళ్ళికొడుకు బంగారు నగలు ఇవ్వడం సాంప్రదాయం. కానీ ఇటీవల వివాహం చేసి వుండటం డబ్బు చేతిలో సరిపడా లేక పోవడంతో.. కొత్త అల్లుడికి బంగారం పెట్టలేకపోయారు. ఇదే సాకుగా చూపి యువరాజ్ భార్యను వేధించినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులు తాళలేక.. రూపవతి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బంగారం పెట్టాలని కోరింది. 
 
ఇంతలోపే.. ఆమె మరణించినట్లు సమాచారం అందడంతో.. ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. కానీ యువరాజ్ మాత్రం కడుపులో నొప్పిగా వుందని.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయిందని చెప్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments