Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎర... 30 మందిపై క్రైస్తవ ఫాదర్ అత్యాచారం

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి 30 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఓ క్రైస్తవ మతబోధకుడు. అంతేకాదు.. అతని వల్ల గర్భం దాల్చిన ఓ యువతి తనను పెళ్లాడాలని పట్టుబట్టడంతో ఆమెను దారుణం

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (08:44 IST)
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి 30 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఓ క్రైస్తవ మతబోధకుడు. అంతేకాదు.. అతని వల్ల గర్భం దాల్చిన ఓ యువతి తనను పెళ్లాడాలని పట్టుబట్టడంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. తాజాగా ఆ కామాంధుడి మాటలకు మోసపోయిన మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని పాపాల చిట్టా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తిరునెల్వేలి జిల్లాకు చెందిన మిలన్ సింగ్‌ (46) రామనాథపురం సాయల్‌కుడి గ్రామంలో ఓ చర్చిలో ఫాదర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈయన ఆరు నెలల క్రితం పాళయంకోటకు చెందిన కాంతిమతి(30) అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఆమె నుంచి రూ.5 లక్షలు, నగలు తీసుకున్నాడు. ఇటీవల ఆమెను తీసుకెళ్లి కదులుతున్న కారులో కిందికి తోసేసి... నగదుతో పారిపోయాడు. ఆమె ఫిర్యాదు ఇవ్వడంతో శంకరన్ కోయిల్‌ పోలీసులు మిలన్ సింగ్‌ను అరెస్టు చేశారు. 
 
అతని వద్ద జరిపిన విచారణలో ఇప్పటివరకు 30 మందివరకు మాయమాటలు చెప్పి అ త్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించాడు. వీరిలో అన్బుసెల్వం (24) అనే యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో సజీవదహనం చేశాడు. ఈ కామాంధ ఫాదర్‌కు అతని భార్య కూడా పూర్తిగా సహకరించడం గమనార్హం. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments