Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాగ్లైడర్ల సాయంతో భారత్‌లోకి పాక్ మిలిటెంట్లు చొరబాట్లు: ఐబీ వార్నింగ్

భారత్‌పై ఉగ్రదాడులకు సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ భూభాగంలో వేచి చూస్తున్న ఉగ్రవాదులు పారాగ్లైడర్లతో దేశంలోకి చొరబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (08:29 IST)
భారత్‌పై ఉగ్రదాడులకు సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ భూభాగంలో వేచి చూస్తున్న ఉగ్రవాదులు పారాగ్లైడర్లతో దేశంలోకి చొరబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు పారాచూట్స్ లేదా పారాగ్రైడర్లను ఉపయోగించే అవకాశమున్నట్టు తెలిపింది. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వ్యూహాలు రచిస్తున్నారని, అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా చొరబాట్లతో పాటు, ఆత్మాహుతి దాడులకు కూడా టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టు ఐబీ సమాచారం. 
 
ప్రధానంగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కాగా, ఐబీ హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల వెంబడి ఎగిరే వస్తువులు, పారాగ్లైడింగ్‌పై అధికారులు నిషేధం విధించారు. అదేవిధంగా సరిహద్దు వెంబడి దాడులకు అవకాశాలున్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments