Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలి బాధతో తల్లి - భర్త మృతి... అంత్యక్రియలకు డబ్బులు లేక శవాలతోనే జాగారం

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (08:57 IST)
ఆ కుటుంబ సభ్యులు కటిక పేదరికంలో జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆకలి బాధను తట్టుకోలేక ముందుగా ఆ మహిళ తల్లి చనిపోయింది. ఆ తర్వాత రోజుల వ్యవధిలో భర్త చనిపోయాడు. వీరికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఆ మహిళ.. తల్లి, భర్త మృతదేహాలను ఇంట్లో పెట్టుకుని జాగారం చేసింది. ఇరుగు పొరుగువారు సమాచారం పోలీసులు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా గోపిశెట్టిపాళెయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శాంతి - మోహన్ సుందరం అనే దంపతులకు మానసిక వికలాంగుడైన కుమారుడు శవరణ కుమార్, కుమార్తె శశిరేఖ ఉంది. శాంతి తల్లి కనకంబాళ్. ఈమెకు వయస్సు 80. వీరంతా కలిసి ఉంటున్నారు. అయితే, శశిరేఖ ఇటీవల వెళ్లి చేసుకుని అత్తరాంటికి వెళ్ళిపోయింది. ఆమెకు వివాహం కాకముందు శాంతి, శశిరేఖల సంపాదనతో పూట గడుపుతూ వచ్చారు. 
 
శశిరేఖ వివాహం తర్వాత భర్తతో వెళ్లిపోవడంతో శాంతి సంపాదన ఏ మూలకు సరిపోలేదు. ఫలితంగా వారి కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలో 80 యేళ్ల కనకంబాళ్ ఆకలి బాధను భరించలేక చనిపోయింది. తల్లికి అంత్యక్రియలు చేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే శాంతి భర్త మోహనసుందరం కూడా చనిపోయాడు. 
 
దీంతో దిక్కుతోచని శాంతి.. రెండు శవాలతో, మానసిక వికలాంగుడైన కుమారుడితో కలిసి జాగారం చేయసాగింది. అయితే, మృతదేహాల నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments