Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చని పందిరి సాక్షిగా ఒక్కటైన జంట... కాళ్ల పారాణి ఆరకముందే వెళ్లిపోయింది...

Advertiesment
new couple
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (08:40 IST)
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తీవ్ర విషాదం జరిగింది. పచ్చని పందిరి సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట.. కాళ్ల పారాణి ఆరకముందే లోకం విడిచి వెళ్లిపోయింది. వారి జీవన ప్రయాణానికి విధి ముగింపు పలికింది. ఇళ్లకు కట్టిన తోరణాలు వాడటకముందే ఆ కుటుంబంలో చావు డప్పులు మోగాయి. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలోని బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు వేణు అలియాస్ సింహాచలం (26) అనే యువకుడికి బ్రహ్మపురకు చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక (23) ఈ నెల 10వ తేదీ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో బంధుమిత్రులంతా పాల్గొన్నారు. ఆ తర్వాత 12వ తేదీన విందు ఏర్పాటు చేశారు. 
 
ఈ విందుకు అందరూ వచ్చి భోజనం చేసి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలు ముగియడంతో అత్తారింటికి నవ దంపతులు బైకుపై బయలుదేరారు. వీరి వాహనం గొళంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో వెళుతుండగా, ఓ ట్రాక్టర్ బలంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభద్ర అక్కడే మృత్యువాతపడగా వేణును మాత్రం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఈ విషాద వార్త తెలుసుకున్న ఇరువురు కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. వారు ఆర్తనాదాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. కాళ్ళపారాణి ఆరకముందే నవ దంపతులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారంటూ ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు!