Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురేవి బీభత్సం.. తమిళనాడులో ఏడుగురు మృతి.. పదిలక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (21:37 IST)
బురేవి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల ధాటికి తమిళనాడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బురేవి ధాటి తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 
 
ఈ నేపథ్యంలో బురేవి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం పళనిస్వామి అధికారులను ఆదేశించారు. వరదల్లో మృతిచెందిన వారికి రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
 
రామేశ్వరంలోని తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో తుఫాను పరిస్థితిపై సీఎం పళనిస్వామి సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు 11మంది మంత్రులను నియమించారు. 
 
ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా కడలూరు జిల్లాలో వర్షాలు కురిశాయి. 2వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి, మూగజీవాలు నష్టపోయిన రైతులకు సీఎం పరిహారం ప్రకటించారు. మరోవైపు, సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments