Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పనిమనిషి కుమార్తెను కొనుగోలు చేసిన వ్యాపారవేత్త!!

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (10:44 IST)
భార్య అలిగి పుట్టింటికి పోవడంతో ఓ పారిశ్రామికవేత్త.. తన ఇంట్లో పాచిపనిచేసే మహిళ కుమార్తెను రూ.10 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. చివరకు ఈ విషయం బహిర్గతం కావడంతో ఆయనతో పాటు.. కుమార్తెను విక్రయించిన తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సేలం అన్నాదానపట్టికి చెందిన సతీష్‌కుమార్‌(30), సుమతి (26) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. సుమతి కొన్నేళ్ల క్రితం చెన్నై నగరంలో ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ యజమాని కృష్ణన్‌ ఇంటిలో పనిమనిషిగా వుండేది. ఆ తర్వాత ఆమె స్వస్థలానికి తిరిగి వెళ్ళింది. ఆ తర్వాత కృష్ణన్‌ మనస్పర్థల కారణంగా భార్యను విడిచిపెట్టి ఒంటరిగా గడుపుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా సుమతి తన కుమార్తెను రూ.10 లక్షలకు కృష్ణన్‌కు విక్రయించింది. అయితే సుమతి తల్లి చిన్నపొన్ను ఈ విషయాన్ని పసిగట్టింది. కొద్ది రోజులుగా తన మనమరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించడంతో మొత్తం గుట్టు రట్టయ్యింది. బాలికను విక్రయించిన సుమతి, సతీష్‌కుమార్‌ను, పారిశ్రామికవేత్త కృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments