Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాంఛ తీర్చాలన్న తండ్రి.. కడతేర్చిన కుమార్తె.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (16:43 IST)
తనకు శారీరక సుఖం ఇవ్వాలంటూ వేధించిన కన్నతండ్రిని ఓ కుమార్తె చంపేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే దివ్యాంగుడు ఉన్నాడు. ఈయనకు భార్య మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. అయితే, వెంకటేశ్‌ పెద్ద కుమార్తె చెన్నైలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా.. చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది.
 
ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు కోసం వెళ్లి వచ్చిన వెంకటేశ్‌ తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహంపై కత్తి పోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించారు.
 
అయితే కేసు నమోదు చేసిన పోలీసులు... లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. వెంకటేష్‌ను రెండో కుమార్తె హత్య చేసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చి  ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులో 'నా తండ్రి లైంగికంగా వేధించాడు.. ఆత్మరక్షణ కోసమే చంపేశాను' అని ఆమె చెప్పినట్లు డీఎస్పీ ఇళంగోవన్‌ తెలిపారు.
 
అనంతరం పోలీసులు బాలికను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మరక్షణ కోసం తండ్రిని చంపిన బాలికను వెంటనే విడుదల చేయాలని విల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం