దివంగత జయలలిత స్నేహితురాలు శశికళను తిరిగి అన్నాడీఎంకే పార్టీలో చేర్చుకునే విషయంపై మానవతా కోణంలో ఆలోచన చేయాని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం అన్నారు. పైగా, ఆమె తిరిగి పార్టీలో చేరుతానంటే తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓపీఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు తమిళనాడు తీవ్ర సంచలనంగా మారాయి. అన్నాడీఎంకేలో అయితే పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి.
శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి వస్తానంటే తప్పకుండా ఆలోచిస్తామని బాంబ్ పేల్చారు. శశికళలపై తనకు ఎలాంటి కోపమూ, ద్వేషమూ లేదని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. పార్టీకి సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పన్నీర్ సెల్వంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్నాడీఎంకే వ్యక్తులపైగానీ, కుటుంబాలపైగానీ ఆధారపడదని, పార్టీలోకి ఎవరైనా రావొచ్చు, వెళ్లొచ్చు అని వ్యాఖ్యానించారు. శశికళ మళ్లీ అన్నాడీఎంకేలోకి వస్తానని ప్రతిపాదననలు పంపితే మాత్రం తప్పుకుండా సానుకూలంగానే ఆలోచిస్తామన్నారు.
శశికళ, దినకరన్ తనకు చాలా గౌరవం ఉందని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. శశికళ తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటే తన ఇష్టమని, నిర్ణయం ఆమెదే అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పళని స్వామితో విబేధాల కారణంగానే మీరు ఇలా కామెంట్స్ చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు, సీఎం పళని స్వామికి ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పళని స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని ప్రతిపాదించిన వారిలో తానూ ఒకరిని అని గుర్తు చేశారు.
శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పళని స్వామి గతంలో తేల్చి చెప్పారు. శశికళ జైలు నుంచి విడుదలైన సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. శశికళ ఆటలు అన్నాడీఎంకేలో సాగవని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆమె తమిళనాడులోకి ఎంటర్ అవడంతోనే ఆమె బంధువులపై వరుసగా ఏసీబీ అధికారులతో దాడులు చేయించారు సీఎం పళని స్వామి.