Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సప్లై ఆపేయండి.. పళనిసామి

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (09:41 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు సప్లై చేస్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాను ఆపివేయాలని, తమిళనాడులో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో తయారయ్యే ఆక్సిజన్‌ను రాష్ట్రంలోనే వినియోగించుకునే అవకాశం కల్పించాలని తెలిపారు.
 
ప్రస్తుతం తమిళనాడుకు రోజు 310 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని, రాబోయే రోజుల్లో మరింత అవసరమయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని 80 మెట్రిక్ టన్నులను తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా నిలిపివేయాలని పళనిస్వామి ప్రధానికి లేఖ రాశారు. 
 
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో 310 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఖర్చు అవుతోందని, కానీ కేంద్రం కేవలం 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేటాయించిందని శ్రీ పెరంబదూర్ నుంచి సప్లై అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తమిళనాడుకు కేటాయించాలని పళనిస్వామి లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments