Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం.. 19 నుంచి 30వరకు లాక్‌డౌన్

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (16:28 IST)
తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నైలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో చెన్నైతో పాటు చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పళని స్వామి ప్రకటించారు. ఈ నెల 19 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 
 
సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రం తమిళనాడు నిలిచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులకు అనుమతిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు అనుమతి వుంటుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేసింది.
 
కాగా, మన దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి వరకు తమిళనాడులో 44,661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 24,547 మంది కోలుకోగా.. 435 మంది మృతి చెందారు. తమిళనాడులో నమోదైన కేసుల్లో అత్యధికం చెన్నైలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించినట్లు తమిళనాడు సర్కారు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments