Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై పెరిగిపోతున్న నేరాలు... రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (14:05 IST)
మహిళలపై నేరాలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ శనివారం తాజా ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని హాథ్రస్ ఘటన తర్వాత మహిళల భద్రతపై రాష్ట్రాలకు మహిళలపై నేరాలకు సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చింది.

మహిళలపై నేరాలు జరిగినపుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 154 లోని సబ్ సెక్షన్ (1) కింద గుర్తించదగిన నేరం జరిగితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. 
 
మహిళలపై లైంగిక వేధింపుల కేసుల సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్, పోలీసుస్టేషను పరిధికి వెలుపల జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. మహిళల నేరాలకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదులో విఫలమైతే అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్రహోంమంత్రిత్వశాఖ హెచ్చరించింది. 
 
మహిళల నేరాలపై ఇండియన్ పీనల్ కోడ్ 1860 (ఐపీసీ) లోని సెక్షన్ 166 ఎ (సి) సెక్షన్ 326 ఎ, సెక్షన్ 326 బి, సెక్షన్ 354, సెక్షన్ 354 బి, సెక్షన్ 370, సెక్షన్ 370 ఎ, సెక్షన్ 376, సెక్షన్ 376 ఎ, సెక్షన్ 376 బి, సెక్షన్ 376 బి, సెక్షన్ 376 సి, సెక్షన్ 376 డి, సెక్షన్ 376 డిఎ, సెక్షన్ 376 డిబి, సెక్షన్ 376 ఇ లేదా ఐపిసిలోని సెక్షన్ 509ల ప్రకారం కేసులు పెట్టాలని కేంద్రం సూచించింది.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం