Publish Date: Fri, 09 Oct 2020 (18:54 IST)
Updated Date: Fri, 09 Oct 2020 (18:56 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19ను మంత్రాలతో పారద్రోలుతానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం... సిరిసిల్ల పట్టణానికి చెందిన కంచర్ల కనకయ్య అనే వ్యక్తి తాయత్తులు, మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
నిందితుడు జిల్లా ప్రజలనే కాకుండా వేరే జిల్లాల నుంచి వచ్చే వారిని కూడా మంత్రాలు, తాయత్తులతో కరోనాను నయం చేస్తానని చెప్పి ధనార్జనకు పాల్పడుతున్నాడని సీఐ రవికుమార్ తెలిపారు. అతని దగ్గరి నుంచి ఉంగరాలు, రంగు రాళ్లు, మూలికలు మొదలగునవి స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని చెప్పారు.