Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్డర్ డిలేః రెస్టారెంట్ ఓనర్‌నే చంపేసిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:20 IST)
స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ ఏజెంట్ ఓ రెస్టారెంట్ ఓనర్‌నే చంపేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఆర్డర్ ఆలస్యమైన కారణంగా అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ డెలివరీ ఏజెంట్ కోసం గాలిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. సునీల్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడాలోని మిత్రా సొసైటీలో జామ్ జామ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఆర్డర్‌ను పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్‌కు వచ్చాడు.
 
ఒక ఆర్డర్‌ను వెంటనే ఇచ్చిన రెస్టారెంట్‌లో పని చేసే వ్యక్తి.. మరో ఆర్డర్ లేటవుతుందని చెప్పాడు. దీంతో సదరు ఏజెంట్ ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. గొడవను అడ్డుకోబోయిన యజమాని సునీల్‌ను ఆ స్విగ్గీ డెలివరీ బోయ్ కాల్చాడు. 
 
వెంటనే సునీల్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినా.. అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ డెలివరీ ఏజెంట్‌తోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని, వాళ్లు అప్పటికే ఆల్కహాల్ మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments