Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ రాజ్యసభ ఎంపి స్వాతిపై భౌతికదాడి... సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రుల వద్ద విచారణ?

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (12:34 IST)
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి వ్యవహారం దేశ రాజధాని రాజకీయాలకు కుదిపేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అదేసమయంలో ఈ కేసులో కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తమ వృద్ధ తల్లిదండ్రులను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారంటూ సీఎం కేజ్రీవాల్ బుధవారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
 
కాగా, స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటనపై కేజ్రీవాల్‌ బుధవారం తొలిసారిగా స్పందించిన సంగతి తెలిసిందే. 'ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నా. న్యాయం జరగాలి. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయి. ఇరుపక్షాల వైపు నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుంది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. ఏమీ మాట్లాడలేను' అని ఆయన తెలిపారు. మరోవైపు, తనపై ఉద్దేశపూర్వకంగానే ఆప్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారని స్వాతి దుయ్యబట్టారు. తన వ్యక్తిగత ఫొటోలు లీక్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments