Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ మాదే... గాజుమేడలో ఉన్నారు జాగ్రత్త... పాక్‌కు సుష్మా వార్నింగ్

పాకిస్తాన్ గాజు మేడలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమనీ, అది ఎప్పటికీ భారతదేశానిదేనని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితిలో ఆమె మాట్

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (20:09 IST)
పాకిస్తాన్ గాజు మేడలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమనీ, అది ఎప్పటికీ భారతదేశానిదేనని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితిలో ఆమె మాట్లాడుతూ, పాకిస్తాన్ దేశంపై మండిపడ్డారు. భారతదేశం స్నేహ హస్తం అందిస్తుంటే పాకిస్తాన్ ఎప్పుడూ తన కుటిలబుద్ధిని చూపించుకుంటూనే ఉందన్నారు. 
 
తాము సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను పురిగొల్పుతోందని అన్నారు. చర్చలకు తాము ఆంక్షలు విధిస్తున్నామంటూ పాకిస్తాన్ చెప్పడాన్ని తప్పుబట్టారు. నవాజ్ షరీఫ్ లాహోర్ నుంచి భారతదేశానికి రావడానికి ఏమైనా ఆంక్షలు పెట్టామా అని నిలదీశారు. 
 
ఉగ్రవాదంపై మాట్లాడుతూ... ప్రపంచంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది ఎవరు? వారికి ఆయుధాలను అందిస్తున్నది ఎవరు? ఇవన్నీ కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేయడంలో ప్రపంచం మొత్తం ఒకతాటిపైకి రావాలన్నారు. ఏ దేశమైనా ఉగ్రవాదులను నిర్మూలించేందుకు వ్యతిరేకిస్తే ఆ దేశం ఉగ్రదేశంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. భారతదేశం ఎప్పటికీ శాంతిని కోరుకుంటుందని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments