సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌ది ఆత్మహత్య కాదు.. హత్యే.. దావూదే కారణం?

Webdunia
బుధవారం, 15 జులై 2020 (17:40 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ మృతి పట్ల భారత అత్యున్నత నిఘా సంస్థ 'రా' (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠానే హత్య చేసిందని ఆరోపించారు. దీని వెనుక దావూద్ ప్రమేయం కూడా ఉందని అన్నారు. 
 
చాలామంది బి-టౌన్ సెలబ్రెటీలు విదేశాలలో దావూద్ బృందం నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు. గ్యాంగ్ స్టర్ డబ్బు సంపాదించడానికి సహాయం చేస్తుంటారు. ఇది ఐఎస్ఐ నిధుల కోసం ఉపయోగించబడుతుంది. సెలబ్రెటీలు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును అందుకుంటారని ఎన్కే సూద్ తెలిపారు. ఈ ముఠానే సుశాంత్‌ని ఫోన్ ద్వారా బెదిరించిందని, అది అతడిని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిందని సూద్ పేర్కొన్నారు.
 
అంతేకాకుండా దావూద్ నుంచి తప్పించుకునేందుకు సుశాంత్ తన ఫోన్ నంబరును 50 సార్లు మార్చాడని చెప్పారు. సుశాంత్ మరణానికి ఒక రోజు ముందు సీసీటివి కెమెరాలు ఆగిపోవడం గురించి కూడా సూద్ మాట్లాడారు. అతడు ఆత్మహత్య చేసుకున్న గది తాళం కూడా నకిలీవన్నారు. ఇంతకంటే.. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అనేందుకు ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments