Webdunia - Bharat's app for daily news and videos

Install App

కి'లేడీ' రియా చక్రవర్తి : ఏకంగా డ్రగ్స్ డీలర్లతో లింకులు... ఫోనులో మంతనాలు...

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (07:41 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ.. గత వారం రోజులుగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, సీబీఐ కంటే ముందు.. బ్యాంకు ఖాతా నుంచి నిధుల తరలింపుపై సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఈ విచారణలో పలు ఆస్తికరమైన విషయాలు వెలుగు చూసింది. డ్రగ్స్ పేరుతో రియా చక్రవర్తికి నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ తేల్చింది.
 
సుశాంత్ స్నేహితులు కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్లని ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో వెల్లడైంది. రియా నేరుగా డ్రగ్స్ వ్యాపారులను సంప్రదించేదని ఈడీ తెలిపింది.  దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఈడీ తాజాగా లేఖ రాసింది. అలాగే, రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను కూడా ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు. 
 
ఈడీ లేఖతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. సుశాంత్ కేసులో రియాను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. కాగా, ఈడీ లేఖతో సుశాంత్ కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. ఇపుడు రియాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments