Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు... ఆక్సిజన్ సరఫరాకు టాస్క్‌ఫోర్స్

Webdunia
ఆదివారం, 9 మే 2021 (08:24 IST)
దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ప్రతి రోజూ వేలాది మంది ప్రజలు ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అదేసమయంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్‌ సరఫరాలోనూ కేంద్రం వివక్ష చూపుతోంది. దీంతో సుప్రీంకోర్టు రంగంలోకిదిగింది. 
 
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆరోగ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మహమ్మారి నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పలు దఫాలుగా తూర్పారబట్టిన సుప్రీంకోర్టు.. పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించింది. 
 
ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారడంతో.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానరీతిలో ఆక్సిజన్‌ను పంపిణీ చేసే విధానాన్ని రూపొందించేందుకు 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. 
 
అలాగే కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేయనుంది. భవిష్యత్‌లో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు సహకారం అందించనున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments