Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ కోసం దేశాన్ని నాశనం చేశారు... మోడీపై మమతా ధ్వజం

Webdunia
ఆదివారం, 9 మే 2021 (08:18 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు దేశాన్ని నాశనం చేశారంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేశారు. కేవలం అధికారమమే పరమావధిగా మోడీ - షా ధ్వజం పనిచేస్తోందన్నారు. ఇందుకోసం దేశాన్ని కాదు.. దేశ ప్రజల ప్రాణాలు కూడా హరించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదని ఆమె ఆరోపించారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణమన్నారు. కేంద్రంలో ఉంటూ ఏ పని చేయకుండా, బెంగాల్‌పైనే దృష్టి సారించి, దేశాన్ని పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. 
 
గత ఆర్నెల్లుగా ప్రతిరోజూ కేంద్రం పెద్దలు బెంగాల్‌ను సందర్శిస్తూనే ఉన్నారని, వారి ప్రయత్నాలన్నీ బెంగాల్‌ను చేజిక్కించుకునేందుకే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌ను వశం చేసుకునేందుకు దేశాన్ని నాశనం చేసినంత పనిచేశారని మమత మండిపడ్డారు.
 
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌గా తృణమూల్ ఎమ్మెల్యే బిమన్ బందోపాధ్యాయ్ మూడోసారి ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలను ప్రేరేపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఎన్నికల్లో ఓటమిపాలవడంతో బీజేపీ హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును హర్షించలేని వాళ్లు ఫేక్ వీడియోల ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments