Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగుతున్న కరోనా కేసులు.. లాక్డౌన్‌పై ఆలోచన చేయాలన్న సుప్రీంకోర్టు

Advertiesment
పెరుగుతున్న కరోనా కేసులు.. లాక్డౌన్‌పై ఆలోచన చేయాలన్న సుప్రీంకోర్టు
, సోమవారం, 3 మే 2021 (11:29 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... రోజూ నమోదయ్యే కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
కొత్త‌గా 3,68,147 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. వాటి ప్రకారం... నిన్న 3,00,732  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,99,25,604కు చేరింది.
 
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వస్తోంది. 
 
ఇప్పటికే కరోనా కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. తాజా విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర,రాష్ట్రాలు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.
 
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో సామూహిక సమావేశాలు, వేడుకలు అన్నింటిని కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవాలని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆక్సీజన్ నిల్వలు అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. 
 
కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి కనుక లాక్‌డౌన్‌పై కూడా ఆలోచిస్తే మంచిదని అత్యున్నత ధర్మాసనం సూచించింది. వైద్య సిబ్బందికి ఈ సమయంలో అన్ని వసతులు కల్పించాలి. అంతేకాదు వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలంటూ ఈ సందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా కరాళ నృత్యం : 3417 మంది మృతి