Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు 19, ఇతడికి 20... ప్రేమ పెళ్లి... చెల్లుద్దా, చెల్లదా? ఇక్కడ చూడండి

పెళ్ళిచేసుకోకపోయినా మేజర్లయిన జంట కలిసి ఉండవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారికి ఆ హక్కు ఉంటుందని తెలిపింది. సహజీవనాన్ని ప్రస్తుతం చట్టసభలే గుర్తిస్తున్నాయని, గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం-2005లోనే ఈ ప్రస్తావన ఉందని పేర్కొంది. చట

Webdunia
బుధవారం, 9 మే 2018 (17:55 IST)
పెళ్ళిచేసుకోకపోయినా మేజర్లయిన జంట కలిసి ఉండవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారికి ఆ హక్కు ఉంటుందని తెలిపింది. సహజీవనాన్ని ప్రస్తుతం చట్టసభలే గుర్తిస్తున్నాయని, గృహహింస నుంచి మహిళలకు రక్షణ  కల్పించే చట్టం-2005లోనే ఈ ప్రస్తావన ఉందని పేర్కొంది. చట్టబద్థంగా సరిపడా వయస్సు లేదన్న కారణంగా తమకు తుషారాతో జరిగిన పెళ్ళిని కేరళ హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ నందకుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
 
నందకుమార్ ఈ నెల 31వ తేదీకి 21 యేళ్ళు పూర్తవుతుంది. బాల్య హక్కు నిరోధక చట్టం ప్రకారం మగవారికి 21, ఆడవారికి 18 యేళ్ళు నిండితేనే పెళ్ళికి అర్హులు. ఐతే తుషారాకి 19 ఏళ్ల నిండటంతో ఆమె మేజర్ అయినట్లే. ఐతే ఆమె తల్లిదండ్రులు మాత్రం కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో తుషారాతో జరిగిన వివాహాన్ని రద్దు చేసిన కేరళ హైకోర్టు తుషారాను తండ్రి కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నందకుమార్ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. 
 
ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయమూర్తి అశోక్ భూషణ్ కీలక తీర్పు ఇచ్చారు. వివాహమయ్యే సమయానికి యువతికి 18 ఏళ్లు నిండాయనీ, ఐతే నందకుమార్‌కి సరిపడా వయస్సు లేదు కాబట్టి 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం రద్దు చేయదగిన పెళ్ళి కాదని పేర్కొంది. అయితే నందకుమార్ మేజర్ కాకపోయినా, తుషారా మేజర్ కనుక వారు పెళ్ళి బంధంతో ఒక్కటి కానప్పటికీ వారికి కలిసి జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments