Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (12:31 IST)
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కేంద్రం కల్పించడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సమర్థించింది. వీరికి పది శాతం కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది. పైగా, ఈ నిర్ణయంలో ఎలాంటి వివక్షా లేదని స్పష్టం చేసింది. 
 
ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించగా, ఈ రిజర్వేషన్లను నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం వ్యతిరేకించారు. 
 
కాగా, గత 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కాగా, తుది తీర్పును సోమవారం వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments