Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త సుందర్‌లాల్ బహుగుణ ఇకలేరు

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (15:13 IST)
దేశంలో ప్ర‌ఖ్యాత‌ ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌గా గుర్తింపు పొందిన చిప్కో ఉద్య‌మ‌కారుడు సుంద‌ర్‌లాల్ బ‌హుగుణ మృతి చెందారు. ఈయన ప్రాణాలను కూడా కరోనా వైరస్ తీసింది. ఈయనకు వయసు 94 యేళ్లు. 
 
రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయ‌న కోవిడ్ చికిత్స పొందుతూ శుక్రవారం మ‌ధ్యాహ్నం 12.05 నిమిషాల‌కు బ‌హుగుణ తుదిశ్వాస విడిచిన‌ట్లు ఎయిమ్స్ డైర‌క్ట‌ర్ ర‌వికాంత్ తెలిపారు. క‌రోనా పాజిటివ్ తేల‌డంతో మే 8వ తేదీన ఆయ‌న్ను హాస్పిట‌ల్‌లో చేర్పించారు. గ‌త రాత్రి ఆయ‌న ప‌రిస్థితి విష‌మించింది. ఆక్సిజ‌న్ లెవ‌ల్ చాలా వ‌ర‌కు ప‌డిపోయింది. ఇన్నాళ్లూ ఐసీయూలో ఆయ‌న సీపీఏపీ థెర‌పీలో ఉన్నారు.
 
కాగా, ఉత్త‌రాఖండ్‌లోని గ‌ర్వాల్ ప్రాంతంలో ఉన్న మ‌రోడా ఆయ‌న స్వ‌గ్రామం. 1974లో ఆయ‌న చిప్కో ఉద్య‌మాన్ని ప్రారంభించారు. చెట్ల న‌రికివేత‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు. చాలా శాంతియుతంగా ఆయ‌న ఆ ఉద్య‌మాన్ని సాగించారు. 
 
ఉత్త‌రాఖండ్‌లో నిర్మించిన తెహ్రీ డ్యామ్‌కు వ్య‌తిరేకంగా కూడా ఆయ‌న పోరాటం చేశారు. ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త సుంద‌ర్‌లాల్ బ‌హుగుణ మృతిప‌ట్ల ప్ర‌ధాని మోడీ సంతాపం తెలిపారు. శ‌తాబ్ధాలుగా ప్ర‌కృతితో స‌హ‌జీవ‌నం చేసే మ‌న జీవిన విధానానికి బ‌హుగుణ తార్కాణ‌మ‌న్నారు. 
 
సుంద‌ర్‌లాల్ మృతి దేశానికి భారీ న‌ష్ట‌మ‌ని, తీర‌ని లోటు అని అన్నారు. ఆయ‌న మృదుస్వ‌భావాన్ని ఎన్న‌టికీ మ‌ర‌వ‌లేమ‌న్నారు. బ‌హుగుణ కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌న్ను ఇష్ట‌ప‌డేవారికి ప్ర‌ధాని మోడీ సానుభూతి వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments