Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోందట, ఎలా?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (14:53 IST)
గత కొన్నిరోజుల ముందు గణనీయంగా తగ్గిన భక్తుల సంఖ్య  మళ్ళీ పెరుగుతోందట. 2 వేలకు తగ్గిన భక్తుల సంఖ్య క్రమంగా 7 వేలకు చేరుకుంది. దీంతో పరిస్థితులు సద్దుమణిగి త్వరలోనే శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని టిటిడి భావిస్తోంది.
 
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్సించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. ఎన్నో వ్యయప్రయాసలుకోర్చి స్వామివారి దర్సనార్థం తిరుమల చేరుకునే భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్సించుకుంటారు.
 
కరోనాకు ముందు శ్రీవారిని 60 వేల నుంచి లక్ష వరకు భక్తులు దర్సించుకునేవారు. కానీ గత యేడాది కరోనా కారణంగా శ్రీవారి ఆలయంలో దర్సనాలను నియంత్రంచడం మొదలుపెట్టింది టిటిడి. మొదటి 80 రోజుల పాటు దర్సనాలను పూర్తిగా నిలిపివేయగా అటు తరువాత పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్సనానికి అనుమతిస్తోంది.
 
మొదట 6 వేలతో భక్తులను దర్సనానికి అనుమతించిన టిటిడి ఆ తరువాత ఈ యేడాది ఏఫ్రిల్ లో 55 వేలమంది భక్తులను స్వామివారి దర్సనానికి అనుమతించింది. కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక మరోసారి భక్తులను నియంత్రించడం మొదలుపెట్టింది టిటిడి. భక్తుల సంఖ్యను తగ్గించింది.
 
వైరస్ ఉదృతి ఎక్కువగా ఉండడంతో భక్తులు కూడా పెద్దగా శ్రీవారి దర్సనానికి ఆసక్తి చూపించడం లేదు. మొదట్లో టిటిడి అందుబాటులో ఉంచిన టిక్కెట్లను కూడా కొనుగోలు చేయలేదు. సాధారణంగా ఆన్లైన్లో దర్సన టిక్కెట్లను విడుదలైన నాలుగైదు రోజుల్లోనే విక్రయాలు జరుగుతూ ఉండగా ప్రస్తుతం అంతకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
మే నెలకు సంబంధించి 40 శాతం టిక్కెట్లను కూడా భక్తులు కొనుగోలు చేయలేదు. కరోనా కట్టడికి  రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో భక్తుల సంఖ్య తగ్గింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉన్నాయి. 
 
పక్క రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఉండడంతో భక్తుల రద్దీ గతవారం భారీగా తగ్గింది. నిత్యం 2 వేలమంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్సించుకున్నారు. టిటిడి చరిత్రలో ఇంత తక్కువసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్సించుకున్న దాఖలాలు లేవు. దీంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కానీ వారాంతంలో మళ్ళీభక్తుల సంఖ్య పెరుగుతోందట. 4 వేలు, 5 వేలు, 7 వేలు ఇలా పెరుగుతూనే ఉండడంతో పాటు హుండీ ఆదాయం కూడా పెరుగుతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments