Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబూ ఎందుకిలా చేశావ్... రాహుల్‌కు సోనియా క్లాస్..!

అనారోగ్యంతో విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ నెల మొదట్లో మెరుగైన చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయం మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకట

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (16:40 IST)
అనారోగ్యంతో విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ నెల మొదట్లో మెరుగైన చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయం మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సోనియా అమెరికా వెళ్లినట్లు తెలిసింది. ఆమె భారత్‌కు తిరుగొచ్చేసరికి రాజకీయంగా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 
 
ఉత్తరప్రదేశ్‌, ఉత్తరఖండ్‌లో బీజేపీ ప్రభంజన విజయం సాధించింది. మణిపూర్‌, గోవాలో ఆధిక్యం సంపాందించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలను మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. ఇదే విషయంపై రాహుల్ గాంధీకి క్లాస్ ఇచ్చారట సోనియాగాంధీ. సీనియర్ నాయకుల సలహాలు తీసుకుని వుంటే ఇంత జరిగి ఉండేది కాదని చెప్పుకొచ్చారట. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌ విషయంలో అఖిలేష్‌తో కలవడంపై మాత్రం సోనియా మరింత మండిపడ్డారట. 
 
ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీని స్థానిక పార్టీతో కలిసి పోటీ ఏమిటని ప్రశ్నించారట. అందులోను అఖిలేష్‌ తండ్రిని వద్దనుకుని వెన్నుపోటు పొడిచిన తరువాతైనా ఆలోచించి ఉండాలని అన్నారట. గెలవాల్సిన రాష్ట్రాల్లో కూడా ఘోరంగా ఓడిపోయాయన్న బాధను రాహుల్ గాంధీ ముందు వ్యక్తపరిచారట సోనియాగాంధీ. ఇప్పుడు బాధపడి ఏం లాభం తరువాతైనా రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళదామని ప్రియాంకా గాంధీ రాహుల్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments