Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాలో కంభంపాటి ఔట్ - కారణం ఆ పార్టీ కేంద్రమంత్రే...!

సొంత పార్టీలోనే కొందరికి శత్రువులుంటారు. ఒకే ప్రాంతంలో ఉన్న నాయకులైతే మరీనూ. అధికార పార్టీలోనైతే ఇక చెప్పనవసరం లేదు. అందులోను పదవి ఉంటే ఇక అంతే. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుంటారు. అదే పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోం

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (15:09 IST)
సొంత పార్టీలోనే కొందరికి శత్రువులుంటారు. ఒకే ప్రాంతంలో ఉన్న నాయకులైతే మరీనూ. అధికార పార్టీలోనైతే ఇక చెప్పనవసరం లేదు. అందులోను పదవి ఉంటే ఇక అంతే. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుంటారు. అదే పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది. వారిద్దరూ ఎవరో కాదు... ఒకరు కేంద్రమంత్రి సుజనాచౌదరి, మరొకరు ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్. 
 
టిడిపిలో సుజనా చౌదరి పట్టు కంభంపాటి ఔట్
 
తెలుగుదేశం పార్టీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి పట్టు పెరుగుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో మరో అధికార కేంద్రంగా ఉన్న పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావును అక్కడ నుంచి పంపించి వేసినట్లు కథనం. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ రావు వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం ముగిసిపోయినా, దానిని పొడిగించలేదు. అందుకు కారణం సుజనాచౌదరి ప్రభావమేనని చెబుతున్నారు. 
 
ఢిల్లీలో రెండు అధికార కేంద్రాలు ఉండటం వల్ల తనకు చికాకుగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుజనా చౌదరి స్పష్టం చేశారట. అంతేకాక సుజనా ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ ఎపి భవన్లో కంభంపాటి రామ్మోహన్ ఛాంబర్‌ను సీనియర్ అధికారి, కేంద్రం నుంచి రాష్ట్ర క్యాడర్‌కు వచ్చిన రజత్ భార్గవ‌కు కేటాయించారట. తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతం రావడం ఒక ఎత్తయితే, సుజనా చౌదరి ఆధిపత్యం పెరగడం మరో ఎత్తుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments