Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి అస్వస్థత - గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (17:04 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ ఉన్నారు. అయితే, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి తీసుకెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. 
 
మరోవైపు, 76 యేళ్ల సోనియా గాంధీ శ్వాసపీల్చడంలో ఇబ్బంది పడుతుండటంతోనే ఆమె ఆస్పత్రికి తీసుకెళ్లారని ప్రభుత్వ వార్తా సంస్థ పీటీఐ మీడియా వెల్లడించింది. నిజానికి సోనియాకు మంగళవారం నుంచే ఆరోగ్యం బాగాలేదని పీటీఐ తన కథనంలో పేర్కొంది. 
 
మరోవైపు, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. అయితే, తన తల్లి అస్వస్థతకు లోనయ్యారని తెలియగానే రాహుల్, ప్రియాంకా గాంధీలు హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments